Pushpa-2 Movie | ఎప్పుడెప్పుడా అని లక్షలాది అభిమానులు ఎదురు చూసిన పుష్ప-2 రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరి ఊహలకు భిన్నంగా వచ్చే ఏడాది ఆగస్టు 15వ డేట్‌ను లాక్ చేసుకుంది. చూస్తుంటే అమ్మో ఇంకా 11 నెలలుంది అని అనిపిస్తుంది. కానీ పుష్ప మేకర్స్ మాత్రం లేటైనా సరైన డేట్‌నే ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే గురువారం వస్తుంది. ఆ రోజు ఎలాగో పబ్లిక్ హాలీడే. ఆ తర్వాత మూడు రోజులు వీకెండ్. ఇవీ కాకుండా సోమవారం రక్షా బంధన్ వస్తుంది అంటే మరో హాలీడే. ఇలా మొత్తంగా 5 రోజుల లాంగ్ వీక్ పుష్పకు కలిసొచ్చింది.
ఇప్పటికే పుష్ప సీక్వెల్‌పై ఏ రేంజ్లో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ హైప్‌కు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన ఈ ఐదు రోజుల్లో రూ.500 కోట్లు దాటేయడం పెద్ద కష్టమైన విషయమే కాదు. పైగా పుష్ప సీక్వెల్ కోసం మనవాళ్లు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. నార్త్ ఆడియెన్స్ సైతం అదే స్థాయిలో అమితాసక్తితో ఎదురు చూస్తున్నాడు. దానికి తోడు రెండు నేషనల్ అవార్డులు రావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పుష్ప పేరు మార్మోగిపోయింది. సుక్కు సైతం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి తీయబోతున్నాడట.
ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సారి పుష్ప గాడు కొట్టే దెబ్బకు బాక్సాఫీస్ అబ్బ అనడం ఖాయమని పుష్పకున్న హైపే తెలుపుతుంది. ఇక సీక్వెల్ హక్కుల కోసం పర భాష నిర్మాతలు/డిస్ట్రిబ్యూటర్లు కోటాను కోట్లు ఆఫర్ చేస్తున్నారట. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లైతే ఏకంగా వందల కోట్లు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారట. చూస్తుంటే పుష్ప సీక్వెల్ బాహుబలి-2, కేజీఎఫ్‌ల తర్వాత ఆ రేంజ్లో ఇండియా మొత్తం వినిపించే సినిమా అవుతుందని తెలుస్తుంది.