PuriSethupathi | డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పూరీసేతుపతి (PuriSethupathi). ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పూరీతో పాటు ఛార్మీ నిర్మిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు ప్రకటించింది. జూలై మొదటి వారంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ ప్రకటించింది. దీంతో కేవలం 5 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా సెట్స్‌లో చివరిరోజున విజయ్ సేతుపతితో ఉన్న ఒక వీడియోను టీమ్ పంచుకుంది. ఈ వీడియోలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్, యూనిట్‌తో పనిచేసిన రోజులను మిస్ అవుతున్నానని, ఈ ప్రయాణం చాలా మధురమైన అనుభవం అని అన్నారు. ఇక షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటి టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, విటివి గణేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
And that’s a wrap for #PuriSethupathi 🎬
After months of an intense, emotional, and joyful journey on the sets, the team has completed the entire shooting process 💥
Get ready for some truly exciting updates soon ❤️🔥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥… pic.twitter.com/HAvLjhTNfX
— Puri Connects (@PuriConnects) November 24, 2025