Puri jagannadh | ఇండియాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ రాసే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్కడే. సినిమాల్లో హీరో అంటే పూరీ జగన్నాథ్ హీరోలా ఉండాలి అనేంత ఇంపాక్ట్ చూపించాడు. సోషల్ ఇష్యూస్‌ను సెటైరికల్‌గా తన సినిమాలో క్యారెక్టర్స్‌తో చెప్పిస్తాడు. ఈయన సినిమాలలో డైలాగ్స్ నిజ జీవితం నుండి ప్రేరణ పొంది రాసుకున్నట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈయన లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. దీని తర్వాత ఇదే కాంబోలో జనగణమన తెరకెక్కనుంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈయన అంతర్జాతీయ స్థాయి సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడని వినిపిస్తుంది.
అంతర్జాతీయ స్థాయిలో, పేరున్న నటినటులతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్లతో పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే తెలుగు సినిమా స్థాయి ఖండాంతరాలు దాటింది. టాలీవుడ్ నుంచి హై బడ్జెట్‌తో వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. లైగర్ సినిమా కూడ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్ సినిమాపైన ప్రేక్షకులలో భారీ అంచానాలను పెంచాయి.
లైగర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అగస్టు 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ముంబై వీధుల్లోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడనే అంశంతో ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్‌తో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా అనన్యపాండే హీరోయిన్గా నటిస్తుంది.