Puri Jagannadh | రామ్‌తో పూరీ జగన్నాథ్.. మళ్లీ తెరపైకి ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్..?
Puri Jagannadh | ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) సినిమాతో రామ్ (Ram Pothineni )కు బ్లాక్ బస్టర్ హిట్టందించాడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). అయితే విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ ఎఫెక్ట్‌తో పూరీ జగన్నాథ్ నెక్ట్స్ చేయబోయే సినిమా ఏంటనే దానిపై డైలామా ఏర్పడింది.
Puri Jagannadh | ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డుల గురించి జోరుగా చర్చ నడుస్తుంది. పూరీ కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ సంపాదించిన యాక్టర్లలో రవితేజ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌తోపాటు రామ్ పోతినేని కూడా ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) సినిమాతో రామ్ (Ram Pothineni )కు బ్లాక్ బస్టర్ హిట్టందించాడు పూరీ జగన్నాథ్. అయితే విజయ్ దేవరకొండతో పూరీ తెరకెక్కించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది.
లైగర్ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. లైగర్ ఎఫెక్ట్‌తో పూరీ జగన్నాథ్ నెక్ట్స్ చేయబోయే సినిమా ఏంటనే దానిపై డైలామా ఏర్పడింది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ మరోసారి రామ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ బ్యానర్ పూరీ కనెక్ట్స్ పై రామ్ హీరోగా మరో సినిమా రాబోతుందని తాజా టాక్. దీనిపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు రామ్ అభిమానులు.
రామ్-పూరీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఏ జోనర్లో ఉండబోతుంది.. మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో రికార్డులు సృష్టించబోతుందోనని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO 20 సినిమా చేస్తున్నాడు రామ్. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
బోయపాటి-రామ్ సినిమా పూర్తయిన తర్వాత పూరీ-రామ్ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు ఇన్సైడ్ టాక్. మరి దీనిపై రామ్ ఏదైనా స్పందిస్తాడేమోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
Read Also :
Virupaksha | విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్.. హ్యాపీ మూడ్‌లో సాయిధరమ్ తేజ్, కార్తీక్ దండు
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరో తెలిసిపోయింది.. ఫస్ట్ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

