Puri Jagannadh | ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు పూరీ జగన్నాథ్. ఎన్నో సూపర్ హిట్స్ టాలీవుడ్‌కి అందించిన పూరీ జగన్నాథ్‌కి ఇప్పుడు సక్సెస్‌లు కరువయ్యాయి. ఆయన చివరిగా చేసిన లైగర్, డబల్ ఇస్మార్ట్ రెండు సినిమాలు భారీ ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్‌ని తెలుగు హీరోలు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు పూరీతో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిన హీరోలు ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారట. అయితే పూరీ తన తర్వాతి ప్రాజెక్ట్ చిరంజీవితో, నాగార్జునతో, విజయ్ దేవరకొండ, గోపీచంద్ తో సినిమాలు చేస్తారని ప్రచారాలు సాగాయి. కాని పూరీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ఇటీవల పూరి జగన్నాధ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి కథ చెప్పగా, ఆయన ఓకే చేయడంతో ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మాణంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుపెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు..ఉగాది రోజున సెన్సేషనల్ కాంబినేషన్ లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్‌హౌస్ పెర్ఫార్మర్ విజయ్‌సేతుపతి అన్ని భారతీయ భాషలలో ఒక మాస్టర్‌పీస్ కోసం చేతులు కలిపారు. #PuriSethupathi అంటూ పోస్ట్‌లో తెలియజేశారు.
ఇటీవల మహారాజాతో భారీ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని భాషలలో అదరగొడుతున్నారు. తెలుగులోను ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సేతుపతి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడని అందరికి నమ్మకం ఉంది. ఇప్పుడు పూరీ సినిమా ఓకే చేశాడంటే అందులో ఎంతో కొంత స్టఫ్ ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో పూరీ హిట్ కొట్టకపోతే మాత్రం ఆయనకి రానున్న రోజులలో చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ సినిమాతో అయిన పూరి కంబ్యాక్ ఇస్తాడా చూడాలి.