Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్(Puri Musings) అనే పేరుతో పూరీ తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. తాజాగా ‘లాడ్జ్’ ఫిలాసఫీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కేవలం ఇది ఒక ఆలోచన మాత్రమే.. సరదాగా మాట్లాడుకుందాం. ఈ భూమి మీద ఎన్నో కోట్ల జీవాలు ఈజీగా, సరదాగా రూపాయి ఖర్చు లేకుండా బతుకుతున్నాయి. కానీ, ఇదే ప్లానెట్‌లో ప్రతి దానికీ డబ్బు కడుతూ బతుకుతున్న ఏకైక జీవి మనిషి. ఈ ప్లానేట్ మనకు దేవుడు ఇచ్చింది. దానికి మనం డబ్బు ఎందుకు చెల్లించాలి. ఒక పక్షి తన ఇష్టం వచ్చిన చోట గూడు కట్టుకుంటుంది. చెట్టు తనకు ఇష్టమున్న ప్రాంతంలో మొలుస్తుంది. ఒక తిమింగలం తలుచుకుంటే వరల్డ్ టూర్ వేసి రావోచ్చు. అడవి దాటడానికి సింహంకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఆఫ్రికాలో ఉండే కొంగలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొల్లేరు సరస్సులో కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాయి. అన్ని జంతువులు పక్షులు, హ్యాపీగా.. ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇబ్బంది లేకుండా గడుపుతున్నాయి. వాటికి డబ్బు అక్కర్లేదు మనకి మాత్రం తినడానికి డబ్బు కావాలి. ఇల్లు కట్టుకోవాలంటే ల్యాండ్ కొనాలి తర్వాత పర్మిషన్ తీసుకోవాలి. బోర్డర్ దాటాలంటే పాస్‌పోర్ట్ ఉండాలి.
మన చేత మనమే ప్రపంచాన్ని నాశనం చేసుకున్నాం. అది వేరే దేశమట.. మనది కాదట. పైగా మన దేశంలో కూడా బతికినంత కాలం డబ్బు కడుతూనే ఉండాలట.. ఆఖరికి మన సమాధికి కూడా మనమే చెల్లించాలి అంట దారుణం కదా ఇది. ఈ పేమెంట్ సిస్టమ్ వల్ల ప్లానెట్ అర్థమే మారిపోయింది. ఇది హోమ్ కాదు లాడ్జ్. మిగతా జీవులన్నింటికే ఇది హోమ్. మనకు మాత్రం కాదు. ప్రతి రోజు రెంట్ కోసం మనం ఇక్కడ బతకాల్సిన అందమైన క్షణాలు అమ్ముకుంటున్నాం. ఎందుకు పని చేస్తున్నామో ఎవరికి తెలియదు. ఒక ముమెంట్‌ను ఎంజాయ్ చేసే టైం లేదు.. ప్రపంచమంతా తిరిగే టైం లేదు. ఒక రాత్రి అంతా వెన్నెలను కుర్చుని చూసే టైం లేదు. ఉరుకులు పరుగులతో డబ్బు కోసం పరిగెడుతున్నాం. ఈ పరుగు మనం చచ్చేంతవరకు ఉంటుంది. దేవుడు మనకి అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి పర్వతం ప్రతి సముద్రం ప్రతి అడవి మనదే. ఆ ఇసుక తిన్నలు నీవే.. హిమాలయాలు నీవే కానీ మనం ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మనిషి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళుతూ బ్రతికిన రోజులే మంచివి. వ్యవసాయం చేసుకుంటూ సెటిల్ అయ్యాడు చూశారా.. అప్పుడే మనిషి దారి తప్పాడు. జీవితంలో స్థిరపడ్డాము అంటే ఇరుక్కున్నాం అని. ఫ్రీడమ్ ఉండదు అందుకే తాడు బొంగరం లేని జీవితాలు ఎంత బాగుంటాయి. హాయిగా పక్షుల్లా ఎగురుకుంటూ వెళ్లొచ్చు. ఒకటి మాత్రం నిజం మనం బతికేది బ్రతుకు కాదు. మన కంటే కాకి మేలు దానీ జీవితం బెటర్ ఉంటది మనకంటే. మనం పుట్టింది ఇంటి రెంట్లు కట్టడానికా..? మళ్లీ జన్మ ఉంటే ఇంకొకసారి పుట్టించొద్దని దేవుడిని మొక్కుకుందాం.. మనకి ఇళ్లు కావాలి లాడ్జ్ కాదు అంటూ పూరీ చెప్పుకోచ్చాడు.