పూరీ, చిరంజీవి కాంబినేషన్ రెడీ.. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి..?

puri jagannadh and chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. కుర్ర దర్శకులతోనే ఎక్కువగా తన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే చాలా మంది డైరెక్టర్స్ ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చిరంజీవి సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఈ కాంబినేషన్ కలిసినట్టే కలిసి చాలాసార్లు దూరం అయిపోయింది. నిజానికి చాలా సంవత్సరాల కిందట చిరంజీవికి ఒక కథ చెప్పాడు. అప్పట్లో ఆ సినిమా కథ నచ్చినా.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత 150వ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు అంటూ అప్పట్లో రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించాడు. దానికి ఆటో జానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ సెకండాఫ్‌లో కథ నచ్చకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్నాడు.
అప్పటి నుంచి చిరంజీవి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు పూరీ జగన్నాథ్న్నాథ్. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆయనతో సినిమా చేయడానికి సై అంటున్నాడు. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు పూరీ జగన్నాథ్ స్క్రిప్టులో సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గాడ్ ఫాదర్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమా స్క్రిప్ట్‌లో పూరీ జగన్నాథ్ తనదైన మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఇంట్రడక్షన్‌తో పాటు మరికొన్ని సన్నివేశాల్లో కూడా మాస్ ఎలివేషన్స్ కోసం పూరీ సాయం తీసుకుంటున్నాడు దర్శకుడు మోహన్ రాజా. చిరంజీవి కోరిక మేరకు పూరి ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్‌లో హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది.
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ చేయి పడితే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలుసు కాబట్టే చిరంజీవి పూరీని సాయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే చిరంజీవితో పూరీ జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. తాజాగా బాబీ సినిమా ఓపెనింగ్‌లో పూరీకి కూడా ఆహ్వానం అందింది. అందులో చిరు దర్శకులంతా ఉన్నారు. పూరీ కూడా అక్కడే ఉండటంతో కచ్చితంగా లైగర్ తర్వాత చిరుతోనే ఈయన సినిమా ఉండబోతుందని కన్ఫర్మేషన్ వస్తుంది. విజయ్ దేవరకొండ లైగర్ కానీ హిట్ అయిందంటే మరో అనుమానం లేకుండా చిరు-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ చూడటం ఖాయం. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్.. నిర్మాత ఎవరో తెలుసా..?
అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ నాలుగోసారి రిపీట్
Pawan kalyan | భీమ్లా నాయక్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
Big News : చిరంజీవి పవన్ మల్టీ స్టారర్ రాబోతుంది..!
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీతో సాయి ధరమ్ తేజ్.. ప్రమాదం తర్వాత తొలి ఫొటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

