Venu Thottempudi | పూరీ జగన్నాథ్ నాతో ‘దేశ ముదురు’ చేస్తానని వచ్చారు : వేణు తొట్టెంపూడి
తన యాక్టింగ్ స్టైల్, కామెడీ టచ్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు వేణు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). తాజాగా అలీ (Ali)తో సరదా టాక్ షోకు హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.
స్వయంవరం (Swayamvaram) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). తన యాక్టింగ్ స్టైల్, కామెడీ టచ్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు వేణు. ఈ సీనియర్ యాక్టర్ సుదీర్ఘ విరామం తర్వాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నాడు. తాజాగా అలీ (Ali)తో సరదా టాక్ షోకు హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.
నా ఫస్ట్ సినిమా నుంచి అలీగారు నాతో ఉన్నారు..ఈ చొక్కా కూడా ఆయనదేనంటున్నాడు వేణు. లెజెండరీ దర్శకుడు భారతీ రాజా (Bharathi raja) డైరెకక్షన్‌లో మీ ఎంట్రీ ఇవ్వాలి..ఎందుకు మిస్సయిపోయింది ఆ ఛాన్స్ అని అలీ అడుగగా..వేణు స్పందిస్తూ సార్ (భారతీ రాజాను) నేను బాగానే చేస్తాను అంటూ ఏవేవో యాక్ట్ చేసి ఆయనకు చూపించాను. ఆ తర్వాత వేణును నేనే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉండేదని భారతీ రాజా నన్ను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు గుర్తు చేసుకుని పెట్టుకున్నారని రని చెప్పాడు వేణు.
ఇంతకీ మీది లవ్ మ్యారేజా..అరేంజ్డ్ మ్యారేజా అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాడనేది ప్రోమోలో సస్పెన్స్ పెట్టారు. పూరీ జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథతో నా దగ్గరకు వచ్చారు. అది చేయకపోయినా నాలో ఏం నచ్చిందో తెలియదు కానీ దేశముదురు సినిమా చేస్తానని వచ్చాను. కానీ ఆ సినిమా మాత్రం నాతో చేయలేదు.
వేణు చాలా రిచ్..పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందంట కదా అని అలీ అడిగాడు. మా అమ్మ సోదరుడు మాగంటి అంకినీడు (maganti ankineedu mp)మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. నేను ఆయనకు మేనల్లుడిని అవుతాను కాబట్టి..వేణు సినిమా బాగా ఆడాలి..ఆడితేనే నువ్వు నాకు మేనల్లుడివని చెప్తానని అనేవారని చెప్పుకొచ్చాడు. ఇక భవిష్యత్‌లో రాజకీయాల్లోకి ఏమైనా వస్తారా..? అని అడిగితే..తప్పనిసరిగా సస్పెన్స్ తో ప్రోమో ముగిసింది.
Read Also : Venu Thottempudi | పూరీ జగన్నాథ్ నాతో ‘దేశ ముదురు’ చేస్తానని వచ్చారు : వేణు తొట్టెంపూడి
Read Also : Sai Pallavi | నా లవ్ లెటర్ చూసి అమ్మానాన్న కొట్టారు : సాయిపల్లవి
Read Also : Nithiin | మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు : నితిన్
Read Also : Krishna Vamsi | ఏడెనిమిది సార్లు ఏడ్చేసిన కృష్ణవంశీ..ఎందుకంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

