టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ (meher ramesh) సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ ప్రాజెక్టు భోళాశంకర్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరుతో సినిమా ప్రకటించినప్పటి నుంచి ఫుల్ జోష్ మీదున్నాడు మెహర్ రమేశ్. ఆ మధ్య వీకెండ్లో తనకిష్టమైన బైక్ రైడ్ చేసి నెట్టింట్లో హల్ చల్ చేశాడు ఈ డైరెక్టర్.
తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు. ట్రెండింగ్ అయ్యేంతలా ఏం చేశాడనే కదా మీ డౌటు. కంత్రి (Kantri Title track)సినిమాలోని టైటిల్ ట్రాక్‌కు స్టైలిష్ డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. సోమవారం (జులై 11)లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు (Mani Sharma birthday) సందర్భంగా ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఈవెంట్లో ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలోని టైటిల్ సాంగ్‌కు డ్యాన్స్ చేయగా..అక్కడున్నవారు కేకలు వేయడం వీడియోలో చూడొచ్చు. మరోవైపు మణిశర్మ కూడా ఈ పాటను మెహర్ రమేశ్‌తో కలిసి ఎంజాయ్ చేశాడు.
మణిశర్మ బర్త్‌డే పార్టీలో 123 నేనొక కంత్రీ పాటకు స్టెప్పులేశా..యాదృచ్ఛికంగా..నేను 2007 జూలై 11న అమెరికాలోని చికాగోలో జరిగిన ఈ పాట ట్యూన్‌ని కంపోజ్ చేసి రాశాను. ఈ వీడియోను కాప్చర్ చేసిన స్వప్న వర్మకు ధన్యవాదాలు..అని వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు మెహర్ రమేశ్.