పునీత్ రాజ్ కుమార్ ఒక హీరోనే కాదు మానవతా వాది. ఆయన చేసిన సమాజసేవకు కొన్ని వేల మంది అనాథలను పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించాడు అంటే ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయమం చేస్తున్న సమయంలో పునీత్‌కు ఛాతిలో నొప్పి రావడం, వెంటనే ఆయన ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించడం, గుండె చప్పుడులో మార్పు గమనించిన ఆయన వెంటనే విక్రమ్ ఆసుపత్రికి సమాచారం అందించడం జరిగింది. ఆసుపత్రికి వెళ్లే లోపే పునీత్ మరణించాడని వార్తలు వచ్చాయి.
తాజాగా పునీత్ చివరి క్షణాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పునీత్ తన ఇంటి నుంచి కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పునీత్ కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పడుకున్నారు. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్ను మూశారు.
పునీత్ తన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఆసుపత్రి నుంచి కారు వరకు నడుచుకుంటు వెళ్లడం సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ కాగా, ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు అప్పు చివరి క్షణాలు అంటూ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో అప్పు యాక్టివ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది.