Puneeth Rajkumar James | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండేవాడు. ఆయన చనిపోయే సమయానికి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి జేమ్స్ . రెండోది ద్విత్వ. ఇందులో జేమ్స్ షూటింగ్ పూర్తయింది. జేమ్స్ సినిమాలో బాడీ బిల్డర్‌గా నటించాడు పునీత్. నిజానికి ఈ సినిమా కోసమే చనిపోవడానికి ముందు కొద్దిరోజులు కష్టపడ్డాడు ఈయన. గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్స్ చేశాడు. ఈ సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లు. ఈ సినిమాను చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 26 ఉదయం 11:11 గంటలకు ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. దాంతో పవర్ స్టార్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. తన అభిమాన హీరో నటించిన చివరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పునీత్‌కు ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెబుతున్నాడు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటించడం విశేషం.
ఇదిలా ఉంటే జేమ్స్ సినిమా విషయంలో పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. దాంతో మార్చి 17 నుంచి 23 మధ్యలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ పునీత్‌కు వాళ్లు ఇచ్చే గౌరవం ఇది. ఆ వారం మొత్తం కేవలం కర్ణాటకలో పునీత్ సినిమా మాత్రమే ఉండాలి అనేది వాళ్లు తీసుకున్న నిర్ణయం. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా జేమ్స్ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?
కలిసిపోయిన యాంకర్ రవి, శ్రీముఖి.. విభేదాలు తొలగిపోయినట్లేనా..?
చిరంజీవి కాదన్న కథతో ప్రభాస్.. కామెడీ చేయబోతున్న డార్లింగ్..
Akhanda Remake | అఖండ రీమేక్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్
sirivennela | 2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీళ్లే..