Puneet Raj Kumar: అప్పు అభిమానులు ఆత్మహత్యలు చేసుకోవడంపై స్పందించిన పునీత్ భార్య

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నాలుగు పదుల వయసులోనే గుండెపోటుతో మరణించి అందరికి తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే ఆయన హఠాన్మరణం చెందడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ లేరనే డిప్రెషన్ లోకి వెళ్లి పోయి కొందరు అభిమానులు ఆత్మహత్య వరకు వెళ్తున్నారట. ఇప్పటి వరకు కన్నడ రాష్ట్రంలో పునీత్ రాజ్ కుమార్ మృతిని జీర్ణించుకోలేక 12 మంది మృతి చెందారు.
ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని మాట్లాడారు. ఈ సమయంలో మీరు చూపిస్తున్న అభిమానానికి మేం ఎప్పుడు రుణపడి ఉంటాం. అప్పు మన మద్య లేకున్నా కూడా ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పు ఎప్పుడు కూడా అభిమానులు సంతోషంగా ఉండాలని కోరుకునే వారు. ఆయన మరణం మా కుటుంబంకు పెద్ద లోటు. అలాంటి లోటు మీ కుటుంబంకు ఉండకూడదు. మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకుని కుటుంబంను ఒంటరి చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య ఆలోచన పెట్టుకోవద్దని.. దిగులుతో ఉండవద్దని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

