స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). రెండు పార్టులుగా రాబోతుండగా.. పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది.
ఈవెంట్ కు సెప్టెంబర్ 23న ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగనుంది. ఇప్పటికే చెన్నైలో ఆడియో, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్ జరిగాయని తెలిసిందే. మణిరత్నం టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతుంది పొన్నియన్ సెల్వన్.
పొన్నియన్ సెల్వన్-1లో స్టార్ యాక్టర్లు చియాన్ విక్రమ్, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, జయరామ్, విక్రమ్ ప్రభు, కార్తీ, జయం రవి, పార్థీబన్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీ వల్లవరాయన్ వండియదేవన్ పాత్రలో నటిస్తుండగా..ఐశ్వర్యారాయ్ రాణి నందిని పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.