Balakrishna – Mansion House | టాలీవుడ్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నాడు బాలయ్య. అయితే దేశంలోనే మూడవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, తాజాగా ఒక మద్యం కంపెనీకి సంబంధించి ప్రకటనలో నటించడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. మ్యాన్షన్ హౌస్ సరోగేట్ అడ్వర్టైజింగ్లో నటించిన బాలయ్య.. అందులో మ్యాన్షన్ హౌస్ వాటర్‌ని ప్రమోట్ చేసినట్లు కనిపించాడు.
అయితే బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆ విషయాన్ని బాలయ్య చాలాసార్లు ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్‌కే ప్రమోషన్ చేస్తుండటంతో బాలయ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గౌరవ ప్రదమైన శాసనసభ్యుడి పదవిలో ఉండడంతో పాటు పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలయ్య.. యువతను చేడగోట్టేలా ఇలా ఆల్కహాల్ బ్రాండ్‌ని ప్రమోషన్ చేస్తున్నాడని.. అతడికి పద్మ భూషణ్ మీదా ఏమాత్రం గౌరవం ఉన్నా తిరిగి ఇచ్చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకుముందు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఇలాగే McDowell’s No.1 అనే బ్రాండ్‌కి ప్రమోషన్ చేయగా.. అతడిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మధ్యలోనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.
“సరోగేట్ అడ్వర్టైజింగ్” అంటే చట్టపరంగా నేరుగా ప్రకటనలు వేయడానికి అనుమతి లేని ఉత్పత్తులను (ఉదాహరణకు మద్యం, పొగాకు) పరోక్షంగా వేరే ఉత్పత్తుల (ఉదాహరణకు సోడా, వాటర్ బాటిల్, మ్యూజిక్ సీడీలు) ప్రకటనల ద్వారా ప్రోత్సహించడం. ఒక బ్రాండ్ పేరును లేదా లోగోను వేరే ఉత్పత్తికి ఉపయోగించి, అసలు ఉత్పత్తిని వినియోగదారుల మనస్సులో నిలిచేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
Mansion House