S.S.Thaman | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇక ఈ మధ్య విడుదలైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. మహేస్‌ను మాస్ యాంగిల్లో చూసి చాలా కాలం అయింది. ఈ సినిమాలో ఊరమాస్ క్యారెక్టర్ ఉండబోతుందని టీజర్‌తోనే త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. జూన్ 24 నుంచి మేజర్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే గత కొన్ని గంటల నుంచి ఈ సినిమా నుంచి థమన్ తప్పుకుంటున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కాగా తాజాగా ఈ వార్తలను చిత్రయూనిట్ ఖండించింది. అలాంటిది ఏమి లేదని స్పష్టం చేసింది. ఇక థమన్ ప్లేస్‌లో జీవి. ప్రకాష్ వస్తున్నాడంటూ కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దాంట్లొ ఎలాంటి నిజం లేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చేశాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Update:
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం…
ఈ నెల 24 నుంచి షూటింగ్..
జనవరి 13న రిలీజ్…
ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్…#GunturKaaram@urstrulyMahesh@haarikahassine @vamsi84 @MusicThaman— YJR (@yjrambabu) June 20, 2023