Daggubati Suresh Babu l సినిమాల్ని ఆపే హక్కు ఎవరికీ లేదు
‘ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి జరిపే చర్చలు వాటి అసలు లక్ష్యాన్ని దాటి వ్యక్తిగతంగా మారు తున్నాయి.
‘ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి జరిపే చర్చలు వాటి అసలు లక్ష్యాన్ని దాటి వ్యక్తిగతంగా మారు తున్నాయి. ఈ నేపథ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారాల్ని రాబట్టడం అంత సులభం కాదు’ అన్నారు అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 13న హీరో వెంకటేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు శనివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘అభిమానుల కోరిక మేరకు..ఆమెజాన్ వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు మాత్రమే సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం. లాభాల్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం’ అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలోని సమస్యల గురించి మాట్లాడుతూ ‘టికెట్ రేట్లు ఎక్కువగా పెంచకూడదని నా అభిప్రాయం. మధ్యతరగతి వారికి సినిమా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాణ సంస్థ ఓ ఇండస్ట్రీగా మారి సొంత నియమాల్ని సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. తప్పు ఎవరిదో నిర్ణయించలేం. అందుకే ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం సాధించడం కష్టం’ అన్నారు. సంక్రాంతి బరిలో సినిమాల మధ్య పోటీ గురించి మాట్లాడుతూ ‘సంక్రాంతి సీజన్లో ఎవరైనా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆపే హక్కు ఎవరికీ లేదు. నా దృష్టిలో ప్రేక్షకులు చాలా నిజాయితీపరులు. వారికి నచ్చిన సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

