Rajesh Danda | వచ్చే ఏడాది పెద్ద సినిమా పక్కా: నిర్మాత రాజేశ్ దండా
‘పంపిణీదారునిగా కంటే నిర్మాతగా ప్రయాణం బాగుంది. నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతకే ఉంటుంది.
Rajesh Danda | ‘పంపిణీదారునిగా కంటే నిర్మాతగా ప్రయాణం బాగుంది. నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతకే ఉంటుంది. అందుకే ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాను’ అంటున్నారు హాస్య మూవీస్ అధినేత, సక్సెస్ఫుల్ నిర్మాత రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేశ్ హీరోగా ‘బచ్చలమల్లి’ సినిమా రానుంది. అలాగే సందీప్‌కిషన్, కిరణ్ అబ్బవరం హీరోలుగా కూడా వీరి సంస్థ నుంచి సినిమాలు రానున్నాయి. నేడు రాజేశ్ దండా పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారాయన.
నేను పంపిణీదారునిగా ఉన్నప్పుడే సందీప్‌కిషన్, అల్లరి నరేశ్ నన్ను నమ్మారు. ఇప్పటికీ నాతో ప్రయాణం చేస్తున్నారు. అందుకే వారితో సినిమాలు చేస్తున్నాను. వారిద్దరితో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఊరుపేరు భైరవకోన చిత్రాలు తీశా. బాగా ఆడాయి. అలాగే నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘సామజవరగమన’. ఇవన్నీ హిట్ అవ్వడం నిర్మాతగా నాలో నమ్మకాన్ని పెంచింది.
నాకు ఇష్టమైన వారితో నా అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేశా. ఉదాహరణకు ‘నాంది’. అది నా జానర్. అలాగే ‘బచ్చలమల్లి’ కూడా నా జానర్లోనే ఉంటుంది. ఇది 90వ దశకంలోని కథ. మే 10నుంచి సాగే సింగిల్ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది.
పంపిణీదారునిగా అనుభవం నిర్మాతగా బాగా ఉపయోగపడుతున్నది. కథల ఎంపికలో కూడా హెల్ప్ అవుతున్నది. త్వరలో పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నాను. స్వతహాగా నేను యాక్షన్ సినిమాల అభిమానిని. రాబోతున్న ‘బచ్చలమల్లి’లో కూడా యాక్షన్ మరోస్థాయిలో ఉంటుంది. అందుకే.. కెమెరా, సంగీతం విషయాల్లో పెద్ద స్థాయిలో వెళ్లాను. కథ తర్వాత ముఖ్యమైంది కెమెరా, సంగీతమే కదా. తప్పకుండా వచ్చే ఏడాది పెద్ద సినిమా పక్కా. హీరో ఎవరనేది సస్పెన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

