Toxic Pre-Release Event | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా సంచలనాత్మక చిత్రం ‘టాక్సిక్’. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యాక్షన్ మరియు బోల్డ్ జోనర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర నిర్మాత కేవీఎన్ (KVN) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
థియేటర్లలో లైట్లు ఆరిపోయి సినిమా ప్రారంభమయ్యాక.. ‘టాక్సిక్’ మిమ్మల్ని కేవలం కథలో లీనం చేయడమో లేదా థ్రిల్ చేయడమో మాత్రమే చేయదు.. అది నేరుగా మీ పల్స్ రేటునే (గుండె వేగాన్ని) మార్చేస్తుంది! అని చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.