‘కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఈ సినిమాను మా సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని అన్నారు నిర్మాత దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఆయన విడుదలచేస్తున్న చిత్రం ‘మడ్డీ’. యువన్, రిధాన్కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రగభల్ దర్శకుడు. ఈ నెల 10న విడుదలకానుంది. దిల్‌రాజు మాట్లాడుతూ ‘దర్శకుడు ప్రగ్భల్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తన సోదరులను హీరోలుగా పరిచయం చేస్తూ ఎన్నో కష్టాలను దాటుకుంటూ అతడు చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. ఆఫ్ మడ్ రేసింగ్ కాన్సెప్ట్‌తో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు అన్నారు.