శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మాతృ’. సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా నటించారు. శ్రీపద్మిని సినిమాస్ పతాకంపై బూర్లె శివప్రసాద్ నిర్మించారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత బి.శివప్రసాద్ మాట్లాడుతూ ‘ఆద్యంతం ఉత్కంఠగా సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రమిది.
ప్రతీ సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమిది’ అన్నారు. ఆమని, నందినీరాయ్, పృథ్వీరాజ్, దేవిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: జాన్ జక్కీ.