నామినేషన్ గురించి ప్రియాంక- మానస్ మధ్య బిగ్ ఫైట్ నడిచింది. మధ్యలో కాజల్ పుల్ల వేయడంతో అది పెద్దది అయింది. మానస్ తర్వాత మాట్లాడతా అని ప్రియాంకతో చెప్పిన ఆమె విసిగిస్తూ ఉండడంతో ప్రియాంక సింగ్ నాకు నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు అంటే నాకు మాట్లాడాలని ఉంది అని అంటుంది ప్రియాంక. నువ్ అంటేనే నేను ఫీల్ అవుతా మానస్.. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు ఏమైనా అంటే పట్టించుకోను అని ప్రియాంక కూడా కోపంగా అంటుంది.
నువ్ నానుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్, నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్ చేయాలని చూస్తున్నావంటూ మానస్ అనడంతో షాకైన పింకీ.. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చి చెప్పింది. దీంతో మానస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వీళ్లు గొడవ పడుతూ ఉంటే.. బయట సిరి దగ్గర కూర్చున్న షణ్ముఖ్ రన్నింగ్ కామెంట్రీ చేస్తుంటాడు.
నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా.. అని మానస్ అంటే.. ఏం ఇష్టం లేదని ప్రియాంక మళ్లీ అతన్ని డిస్ట్రబ్ చేస్తుంది. కాజల్-మానస్లు మాట్లాడుకుంటూ ఉండగా.. పింకీ వచ్చి మాకు స్పేస్ కావాలి.. నువ్ బయటకు వెళ్లు కాజల్ అని అంటుంది ప్రియాంక. వెంటనే కాజల్ లేచి వెళ్లిపోతూ.. స్పేస్ ఇవ్వడం అంటే ఇదే గుర్తుపెట్టుకో పింకీ అని అంటుంది. దీంతో పింకీ.. కాజల్‌పై చూపిస్తూ నోర్ముయ్ అని రెచ్చిపోతుంది. హౌస్ లో కాజల్ గొడవల్ని పెద్దది చేస్తుందంటే ఇన్నాళ్లూ నమ్మలేదు.. ఇప్పుడు తెలుస్తుంది అంటూ గొడవపడుతుంది ప్రియాంక. మానస్ కాజల్‌కి సపోర్ట్ చేయడంతో ప్రియాంక శివాలెత్తిపోయింది.