బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు.ఇందులో ఇంటి సభ్యులని రెండు టీంలుగా విడగొట్టారు. బ్లాక్ రోజ్, రెడ్ రోజ్ లు ఇచ్చి వాటి వెనక నిలుచోవాలని అన్నారు. దీంతో వారు ఆలోచించుకొని కాజల్, శ్రీరామ్, పింకీ, మానస్, షణ్ముఖ్‌లు సూపర్ హీరోస్ టీం కాగా.. రవి, జెస్సీ, ఆనీ, విశ్వ, సిరి, సన్నీలు విలన్ టీంలో ఉన్నారు. ఇందులో ఒక్కొక్క ఇంటి సభ్యుడిని టార్గెట్ చేసి,వారికి ఒక టాస్క్ ఇచ్చి వారికి ఐ క్విట్ అని అనిపిస్తే వాళ్లకి పాయింట్ లభిస్తుందని చెప్పారు
ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్లు వస్తాయో ఆ టీం గెలుస్తుందే.. గెలిచిన టీం సభ్యులే కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పారు బిగ్ బాస్. దీనిపై మానస్,ప్రియాంకలు డిస్కషన్ చేశారు. నిన్ను అన్నయ్య అని పిలిపిస్తారేమో.. పిలుపేగా పిలిచేస్తా అని అన్నది ప్రియాంక. ఒకవేళ సీజన్ మొత్తం అన్నయ్య అని పిలవమన్నా పిలుస్తానని చెప్పు అని మానస్ అంటే.. ఛీ ఇది మరీ దారుణం.. సీజన్ మొత్తం అన్నయ్య అని ఎలా పిలుస్తాం మానస్.. ఒక టాస్క్ వరకూ ఓకే కానీ.. అంటూ తెగ సిగ్గుపడిపోతూ బాధపడిపోయింది పింకీ.
గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోస్ టీమ్‌లోని కాజల్ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ తాళాలన్నీ ఓపెన్ చేసింది. ఇది చూసిన విలన్స్ టీమ్‌కి చెందిన విశ్వ వెంటనే వచ్చి తన టీమ్‌వైపు ఉన్న డోర్ తాళాలను తెరిచి హౌస్‌లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ విశ్వ మొదటగా స్టోర్ రూమ్‌లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ మండిపడింది. మీరు ఫిజికల్ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది.