Priyanka Singh New Movie | ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంకసింగ్, పూజిత పుందిర్, రాజ్‌గౌడ్, సునందిని, మధుసూదన్ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. సాంకేతికత, భావోద్వేగాలు, లింగ సమానత్వం..ఈ మూడింటి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఘంటసాల విశ్వనాథ్ దర్శకుడు. వేణుబాబు.ఏ నిర్మాత. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఇదో వైవిధ్యమైన కథాంశమని, అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని, డిసెంబర్ 26న షూటింగ్ మొదలుపెట్టి, పదిహేను రోజుల్లో సగం షూటింగ్ కంప్లీట్ చేశామని, ఈ ఏడాదే సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్‌కుమార్ చిన్నయ్య, సంగీతం: పవన్చరణ్, జీవి.