బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఒకవైపు ప్రేక్షకులకి ఎంటర్టైన్ అందించడమే కాదు కంటెస్టెంట్స్‌కి కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ షో ద్వారా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ బాగానే వెనకేసుకొచ్చారు. పదమూడో వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, ఇప్పుడు ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి.
సెప్టెంబరు 5న మొదలైన సీజన్-5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక .. మొత్తం 91 రోజులు హౌజ్‌లో ఉంది. ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోల ద్వార పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక తనదైన శైలిలో గేమ్ ఆడి అలరించింది. తమన్నా సింహాద్రి తర్వాత తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రెండో ట్రాన్స్‌జెండర్‌గా పింకీ నిలిచారు. ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి వచ్చిన ఆమె దాదాపు 90 రోజుల పాటు హౌస్‌లో ఉండటం మామూలు విషయం కాదు
13వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి భారంగా నిష్క్రమించింది ప్రియాంక . ఈసారైనా ఒక ట్రాన్స్‌జెండర్ ఫినాలేలో అడుగుపెడుతుందేమోనన్న ఆశలను అడియాశలు చేసింది. అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. అంతేకాదు ఆమెకు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకునే టాక్ వినిపిస్తుంది. 13 వారాలకు గానూ మొత్తంగా దాదాపు పాతిక లక్షల రూపాయలు పింకీ సంపాదించినట్టు తెలుస్తుంది.