Priyanka Mohan| కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లియో (Leo.. Bloody Sweet) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. దళపతి 67గా వస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమా దళపతి 68. కస్టడీ ఫేం వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో ఈ సినిమా ఉండబోతుంది. కాగా ఈ చిత్రంలో అలనాటి అందాల తార జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) పేరు కూడా వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) మరో హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వస్తుందగా. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని టాక్ నడుస్తోంది. వెంకట్ ప్రభు-విజయ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పక్కా పొలిటికల్ జోనర్లో ఉండబోతుందని కోలీవుడ్ సర్కిల్ సమాచారం.
పాన్ ఇండియా కథాంశంతో రానున్న దళపతి 68లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందని ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. ఖుషి తర్వాత విజయ్-జ్యోతిక కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో వస్తోన్న లియో ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ చేస్తుండగా.. హెరాల్డ్ దాస్‌గా కనిపించబోతున్నాడు. మేకర్స్ ఇటీవలే హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో (Glimpse of Harold Das)ను లాంఛ్ చేశారు. మరోవైపు సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..