ప్రియాంక మోహన్ కన్నడంలో బంపరాఫర్‌ను దక్కించుకుంది. ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ దర్శకుడు హేమంత్ రావు డైరెక్షన్లో ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ పేరుతో ఓ స్పై థ్రిల్లర్ తెరకెక్కనుంది. ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో ప్రియాంక మోహన్ జాయిన్ అయింది.
ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు మేకర్స్. 1980 దశకంలో నడిచే ఈ పీరియాడిక్ కథలో ప్రియాంక మోహన్ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని చెబుతున్నారు. శివరాజ్‌కుమార్‌గారి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన సినిమాలో భాగం కావడంతో తన కల నిజమైందని, కన్నడంలో తనకు బ్రేక్ నిచ్చే చిత్రమవుతుందని ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేసింది.