గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Mohan). ఆ తర్వాత శ్రీకారం, డాక్టర్, ఈటీ, డాన్ సినిమాల్లో మెరిసింది. ఈ బ్యూటీ తాజాగా కొత్త సినిమాను మొదలుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) నటిస్తోన్న సినిమాలో ప్రియాంక మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాజేశ్ ఎం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో ఇవాళ గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
కేరళలో వచ్చే శుక్రవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగనుంది. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ (Screen Scene Media Entertainment) బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రావు రమేశ్, నట్టీ నటరాజ్, వీటీవీ గణేశ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ జైరాశ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
జయం రవి మరోవైపు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్‌లో కీ రోల్ పోషిస్తున్నాడు. దీంతోపాటు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగులో బావ బావమరిది, పల్నాటి పౌరుషం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన జయం రవి టాలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ ఉంది.
@Screensceneoffl's next with @actor_jayamravi and Director @rajeshmdirector kickstarted with Pooja#JR30Pooja#JR30 @jharrisjayaraj @priyankaamohan @natty_nataraj #RaoRamesh @vtvganeshoff @vivekcinema pic.twitter.com/sQh7HLz1kX
— Screen Scene (@Screensceneoffl) August 5, 2022