Priyanka Jain | అమెరికా వీధుల్లో రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ మిక్స్ డ్ కామెంట్స్
Priyanka Jain | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక జైన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు.
Priyanka Jain | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక జైన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తూ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ బ్యూటీ ఇటీవల మరోసారి హాట్ టాపిక్ అయింది. ప్రియాంక, నటుడు శివకుమార్‌తో గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్. చాలాకాలంగా వీరి ఎంగేజ్మెంట్, పెళ్లి గురించి గాసిప్స్ తెగ హల్చల్ చేస్తున్నా, ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా స్పందించిందిలేదు.
అయితే ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో “వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కుతాం” అంటూ చెప్పడంతో అభిమానుల్లో ఆనందానికి అవధులే లేకుండా పోయింది. మౌనరాగం, జానకి కలగనలేదు లాంటి సీరియల్స్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, చెల్తే చల్తే సినిమాతో వెండితెరకు అడుగుపెట్టింది. అయితే సినిమాల్లో అంచనాల మేరకు అవకాశాలు రాకపోయినా, సీరియల్స్ ద్వారా స్టార్ హీరోయిన్స్ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఆటతీరు, ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక.
బిగ్ బాస్ షో తర్వాత గ్లామర్ పరంగా మరింత బోల్డ్ అవతారంలోకి మారింది అందాల ముద్దుగుమ్మ ప్రియాంక. సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫొటోషూట్లతో తెగ హల్చల్ చేస్తున్న ఈ నటి, తాజాగా అమెరికాలో శివకుమార్‌తో కలిసి విహరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో వీరి మధ్య కెమిస్ట్రీ స్పష్టంగా కనిపించడంతో, కొంతమంది నెటిజన్లు “నడి రోడ్డుపై ఈ రొమాన్స్ ఏంటి?” అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అయినా కూడా, ఈ జంటకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రియాంక, శివ కుమార్ తమ కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

