అమెరికా కోడలు ప్రియాంక చోప్రా జోనాస్ స్టైలిష్కి కేరాఫ్ అడ్రెస్ అన్న సంగతి మనందరికి తెలిసిందే. ఎప్పుడు వెరైటీ డ్రెస్‌లలో కనిపించే ప్రియాంక చోప్రా తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపించి అందరిని అలరించింది. జూన్ మాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రైడ్ మంథ్
గా గుర్తించగా.. ప్రియాంక ఇలా టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో ప్రత్యక్షమైంది. థై స్లిట్ లెహంగా -పుల్ ఓవర్ కోటుతో ఏంజెల్లో కనిపిస్తుంది.
ఈ వైట్ డ్రెస్‌లోను సెక్స్ అప్పీల్ కనిపించకుండా డిజైన్ చేయించుకుంది ఈ అమ్మడు. వైట్ డ్రెస్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా చేతికి బంగారు కడియాలు.. కళ్లకు సన్ గ్లాసెస్.. ఆ చెవులకు నెలవంక రింగు ధరించి అందరి దృష్టిని తనవైపు కు తిప్పుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా లుక్‌కి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ప్రియాంక తన ఫొటోకు సండే OOTD. NYC లో ప్రేమను అనుభవిస్తున్నా… అని కామెంట్ పెట్టింది.