Priyanka Arul Mohan| ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్‌ను రౌండప్ చేస్తున్న భామ ఎవరంటే వెంటనే చెప్పే పేరు కోలీవుడ్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan). బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ భామ తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ ఓజీ (OG) ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్‌కే పరిమితమైన ప్రియాంకా మోహన్ ఈ సారి రూటు మార్చేసింది. కెప్టెన్ మిల్లర్ చిత్రంలో లేడీ మిల్లర్‌గా పిస్తోల్ చేత బట్టి తిరుగుబాటు చేస్తున్న స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రియాంక లుక్ చూసి స్టన్ అవుతున్నారు అభిమానులు, ఫాలోవర్లు. ఈ చిత్రం డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రియాంకా మోహన్ మరోవైపు కస్టడీ ఫేం వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో వస్తున్న దళపతి 68లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ నెక్ట్స్ జాయిన్ అవబోయే ప్రాజెక్ట్ ఇదేనంటూ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పక్కా పొలిటికల్ జోనర్లో రాబోతున్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక మరో ఫీ మేల్ లీడ్రోల్లో కనిపించనుంది.
తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమాతో ఆడియెన్స్‌ను పలుకరించిన ప్రియాంకా మోహన్.. ఆ తర్వాత డాక్టర్, డాన్ చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి.
కెప్టెన్ మిల్లర్‌లో ప్రియాంకా అరుళ్ మోహన్..