ప్రియమణికి బంపర్ ఆఫర్.. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో చాన్స్!

పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ కొందరు హీరోయిన్లు అది చేసి చూపిస్తున్నారు. అందులో ప్రియమణి కూడా ఉంది. హీరోయిన్గా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్తుతం బిజీ అవుతుంది ప్రియమణి. ఈ మధ్య నారప్ప సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది ప్రియమణి. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యే ఈమె నటించిన ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. బుల్లితెరపై కూడా బిజీ అయిపోయింది ప్రియమణి. తెలుగు, తమిళంలో కొన్ని షోలకు జడ్జిగా మారిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. ఇలా బిజీగా గడిపేస్తున్న ఈమెకు ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలోనే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఏ సినిమాలో ప్రియమణి నటించబోతోంది అనేది ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇప్పటికే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన కాస్టింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు మిగిలింది హరీష్ శంకర్ సినిమా మాత్రమే. దాంతో పాటు సురేందర్ రెడ్డి సినిమాకు కూడా కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అయితే హరీష్ సినిమా తర్వాతే ఈ సినిమా ఉండబోతుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ మొదలు కానున్నట్టు మధ్య ప్రకటించాడు దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదివరకే హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలు చేసింది పూజా హెగ్డే. దాంతో మరోసారి ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో ప్రియమణి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో తన కెరీర్‌ను మలుపు తిప్పే పాత్ర ఇది అవుతుందని ఆమె కూడా నమ్ముతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జీవిత, హేమ.. కారణమిదే
Tollywood Drugs Case| రకుల్ ప్రీత్ సింగ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. 6 గంటల పాటు విచారణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

