వాటిపై నాకు అవగాహన శూన్యం
‘నా కెరీర్లో ‘ఆర్టికల్ 370’ ఓ మరపురాని అనుభూతిని ఇచ్చిన సినిమా’ అంటున్నారు ప్రియమణి. యామీ గౌతమ్‌తో కలిసి ఆమె నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఈ నెల 23న విడుదలైంది.
‘నా కెరీర్లో ‘ఆర్టికల్ 370’ ఓ మరపురాని అనుభూతిని ఇచ్చిన సినిమా’ అంటున్నారు ప్రియమణి. యామీ గౌతమ్‌తో కలిసి ఆమె నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ప్రేక్షకుల్లో స్పందన కూడా బాగానే ఉందని టాక్. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రియమణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు చట్టం గురించి కానీ, రాజ్యాంగంలోని అంశాల గురించి కానీ అవగాహన శూన్యం.
ఈ సినిమా ఆఫర్ రాగానే అసలు ‘ఆర్టికల్ 370’ అంటే ఏంటో తెలుసుకోవాలని ఒప్పుకున్నాను. కథ విన్న తర్వాత ఇందులో భాగం అయినందుకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది కల్పిత కథ కాదు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన కథ. ఈ సినిమా చేసినందుకు కొన్ని అంశాలపై నాకు అవగాహన కుదిరింది.
అలాగే ఆడియన్స్‌కి కూడా పలు అంశాలపై అవగాహన పెంచే సినిమా ఇది’ అని చెప్పారు ప్రియమణి. ఇంకా మాట్లాడుతూ ‘నాకు నచ్చిన యాక్ట్రస్లో యామి గౌతమ్ ఒకరు. తను పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలే ఎక్కువ చేసింది. ఈ సినిమా ఆమెలోని మరో కోణం. ఈ పాత్ర కోసం చాలా కష్టపడింది యామి. తనతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

