‘ఓరు ఆధార్ లవ్’ మలయాళ మూవీతో హీరోయిన్గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్… ఇందులోని ఓ సాంగ్‌లో భాగంగా కన్ను గీటు కొట్టి ‘వింక్ గాళ్’గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్` చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహించారు.
ఇక నితిన్ కి జంటగా చెక్ అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి తెగ అందాలు ఆరబోసింది. ఇందులో ప్రియా ప్రకాశ్ గ్లామర్ షోని చూసి టాలీవుడ్ ప్రేక్షకులు మైమరచిపోయారు.ప్రస్తుతం తెలుగులో భారీగానే ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నప్పటికీ సక్సెస్ రేటు పెద్దగా లేదు. దీంతో అందరు హీరోయిన్స్ రూట్లో ఈ అమ్మడు కూడా పోతుంది.
కొద్ది కాలంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా పరువాల విందుకి సిద్ధమైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ షోకి సంబంధించి రెండు ఫొటోలు షేర్ చేయగా, ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.