Rajinikanth – Shah Rukh Khan | పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan). మలయాళ బ్లాక్ బస్టర్ లుసీఫర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. మోహన్ లాల్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్, టోవినో థామస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి రీసెంట్గా టీజర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన రజనీకాంత్‌తో పాటు షారుఖ్ ఖాన్‌లను డైరెక్ట్ చేయాలని ఉందని తెలిపాడు. నేను లండన్‌లో లైకా నిర్మాత సుభాస్కరాన్తో లంచ్ చేస్తున్నప్పుడు రజనీకాంత్ కోసం ఒక స్టోరీ ఆలోచన వచ్చింది. ఆ విషయం సుభాస్కరాన్కు చెప్పగానే అతడికి పిచ్చిపిచ్చిగా నచ్చిందంటూ ఆయన చెప్పుకోచ్చాడు. ఇదే ఆలోచనతో షారుఖ్‌తో చేయాలని ఉందంటూ ఆయన చెప్పుకోచ్చాడు.