మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కడువా’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ అండ్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల 30న విడుదల చేస్తున్నారు. ‘విభిన్న కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న మరో వినూత్న చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలతో మెప్పిస్తుంది. భాషా హద్దులు లేకుండా అలరించే కథా కథనాలు ఇందులో ఉంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీప్ పోతన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ : అభినందన్ రామానుజం.