Yatra 2 | ‘యాత్ర 2’ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌లో మమ్ముట్టి, జీవా
Yatra 2 | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యాత్ర 2. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహిస్తున్నాడు.
Yatra 2 | 2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర (Yatra). మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 (Yatra 2) వస్తుందని తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
ముందు చెప్పినట్లుగానే యాత్ర 2 ఫస్ట్ లుక్‌ను ఉదయం 11 గంటలకు మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్‌లో ఒకవైపు జీవా ఉండగా.. మరోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ఈ పోస్టర్లో ”నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని” అంటూ పోస్టర్లో రాసుకోచ్చారు. దీనితో పాటు మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.
Presenting the first look of #Yatra2. In cinemas worldwide from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @JiivaOfficial @ShivaMeka @MahiVraghav pic.twitter.com/4m4PhJsurF
— Mammootty (@mammukka) October 9, 2023
ఇదిలా ఉండగా.. యాత్ర ఫస్ట్ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్ పార్టులో మమ్ముట్టి, జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

