Baby | ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) హీరోగా నటిస్తోన్న సినిమాల్లో ఒకటి బేబి (Baby). హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) డైరెక్ట్ చేస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఇప్పుడు మూడో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్.
బేబి నుంచి ప్రేమిస్తున్నా అంటూ సాగే మూడో సాంగ్‌ను మే 15 సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఓ రెండు మేఘాలిలా సాంగ్ యూట్యూబ్‌లో 20 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించగా.. రెండో సాంగ్ దేవరాజా (DevaRaaja) 5 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన బేబి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్నిమాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ గతేడాది మిస్టరీ క్రైం థ్రిల్లర్ హైవే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం మరోవైపు గమ్ గమ్ గణేశాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా అప్డేట్ రావాల్సి ఉంది.
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో