Malayala Actor Priya | 8 నెలల గర్భిణి.. గుండెపోటుతో ప్రముఖ నటి మృతి
Malayala Actor Priya | మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి (TV Actor) డాక్టర్ ప్రియ గుండెపోటుతో (Heart Attack) మరణించింది. 35 ఏళ్ల ప్రియ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి (Pregnant ).
Malayala Actor Priya | మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి (TV Actor) డాక్టర్ ప్రియ గుండెపోటుతో (Heart Attack) మరణించింది. 35 ఏళ్ల ప్రియ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి (Pregnant ). అక్టోబర్ 31న రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియ ఉన్నట్టుండి అక్కడ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. దీంతో వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ప్రియ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా, మలయాళ టీవీ పరిశ్రమలో పాపులర్ నటులలో డాక్టర్ ప్రియ ఒకరు. ‘కరుతముత్తు’ (Karuthamuthu) పాపులర్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, వివాహమైన తర్వాత ఆమె నటనకు విరామం తీసుకుంది. ప్రియ వృత్తిరీత్యా డాక్టర్ కూడా. తిరువనంతపురంలోని పీఆర్ఎస్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది.
కాగా, సోమవారం కూడా మలయాళ ప్రముఖ నటి ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల రెంజూష మీనన్ (Renjusha Menon) బలవన్మరణానికి పాల్పడింది. తిరునంతపురంలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
Also Read..
Jio World Plaza | రణ్‌వీర్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన నీతా అంబానీ.. వీడియో వైరల్
Varun Tej-Lavanya Tripathi | ఇటలీలో VarunLav పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో మెరిసిన కొత్త జంట
Sachin Pilot | భార్యతో విడిపోయిన సచిన్ పైలట్.. ఎన్నికల అఫడవిట్లో వెల్లడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

