Jio World Plaza | రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘జియో వరల్డ్ ప్లాజా’ (Jio World Plaza) పేరుతో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాజాను మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్లాజా ప్రారంభోత్సవంలో అంబానీ కుటుంబంతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. అంతా నలుపు రంగు దుస్తులు ధరించి మెరిసిపోయారు. కాగా, ఈ వేడుకలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా ‘సింబ’ (Simba) చిత్రంలోని ‘ఆంక్ మేరీ’ అనే పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు. స్టేజ్ వద్ద ముందు వరుసలో భర్త ముకేశ్ అంబానీతో కలిసి కూర్చున్న నీతా అంబానీ (Nita Ambani)ని ఉద్దేశిస్తూ.. ‘నీతా భాబీ.. చాలా అందంగా, అద్భుతంగా ఉన్నారు’ (Looking Like A Wow) అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి నీతా అంబానీ నవ్వుతూ.. రణ్‌వీర్‌కు ఫ్లైయింగ్ కిస్ (Flying Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Jio World Plaza | జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. అంబానీ పార్టీలో సందడి చేసిన తారలు
Sachin Pilot | భార్యతో విడిపోయిన సచిన్ పైలట్.. ఎన్నికల అఫడవిట్లో వెల్లడి