Hanuman Movie Release Date | ఆరు నెలలకు పైగా టైమ్ ఉన్న సంక్రాంతిపై ఇప్పటి నుంచే స్లాట్లు బుక్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్-K, గుంటూరు కారం, ఈగల్ సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సంక్రాంతి బరీలో దిగుతున్నట్లు తెలుస్తుంది. అదే తేజ సజ్జా హీరోగా నటిస్తున్న హనుమాన్ మూవీ. సూపర్ హీరో ఫాంటిసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి.
కాగా ఈ సినిమాను ముందుగా సమ్మర్ కానుకగా మే 12నే విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ పలు కారణాలు వలన పోస్ట్ పోన్ చేసింది. అయితే ఈ ప్రకటన వచ్చి కూడా రెండు నెలలు దాటింది. అయినా ఇప్పటివరకు మేకర్స్ మరో కొత్త డేట్ను ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను శనివారం రివీల్ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే దాదాపు సంక్రాంతికే ఈ సినిమా వస్తున్నట్లు సమాచారం. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ కోసం మరింత టైమ్ కేటాయించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.