ప్రభాస్ తన కొత్త సినిమా ‘సలార్’ చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్నది. ఇక్కడ మటేరా అనే ప్రాంతంలోని లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’లో ఈ లొకేషన్స్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా అదే స్థాయి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటలీ, నేపుల్స్, రోమ్, బుడాపెస్ట్‌లోని చారిత్రక ప్రదేశాల్లో కీలక పోరాట దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. సెప్టెంబర్ 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.