Prashanth Neel | కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుట్టింది బెంగళూరులో అయిన తెలుగు ఫ్యామిలీకి చెందినవాడు కావడంతో చిన్నప్పటి నుంచే టాలీవుడ్ ప్రభావం అతడిపై బాగా పడింది. ఆ ఎఫెక్ట్‌తోనే అతడు తీసిన కేజీఎఫ్ చాఫ్టర్ 1,2, సలార్ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో రాబోతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అతడి సినిమాలన్ని డార్క్ షేడ్‌లో ఉండటమే కాకుండా.. హీరోతో పాటు నటీనటులందరూ నలుపు రంగు బట్టలు ధరించి ఉండడం. షూటింగ్ లోకేషన్స్ కూడా బొగ్గుతో క్రియేట్ చేసినట్లు ఉండడం కనిపిస్తుంది. దీంతో ప్రశాంత్ నీల్‌కి ఈ నలుపు రంగు పిచ్చి ఏంటి అని అభిమానులు కామెంట్లు పెడుతుంటారు.
అయితే ప్రశాంత్ తాజాగా నలుపు రంగు బట్టలు వదిలేసి తెలుపు రంగు సాంప్రదాయ దుస్తులను ధరించాడు. ఒక వేడుకలో భాగంగా ఇలా రెడీ అవ్వగా.. ప్రశాంత్ నీల్ అలా తెల్లబట్టల్లో చూసి మురిసిపోయిన అతడి భార్య లిఖితా.. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. ఫైనల్‌గా నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేశాడంటూ లిఖితా రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.