Prashanth Neel | ‘కేజిఎఫ్’ సినిమా చూసిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి అందరూ ఇదే మాట్లాడారు. అయితే అదే మ్యాజిక్ రెండో దాంట్లో కూడా కంటిన్యూ చేస్తాడా అనేది చాలా మందికి అనుమానాలు ఉండేవి. ఇప్పుడు వాటిని పటాపంచలు చేస్తూ కేజిఎఫ్ చాప్టర్ 2 అద్భుతంగా తెరకెక్కించాడు ప్రశాంత్. మొదటి భాగం రేంజిలో రెండో భాగం లేకపోయినా కూడా ఎలివేషన్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. అదే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా మారింది. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అని అడక్కూడదు. థియేటర్ కు వెళ్లి ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలంతే. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ అచ్చంగా అలాంటి సినిమానే.
కథతో పనిలేదు.. కథనంతో అవసరం లేదు.. స్క్రీన్ మీద జరిగే మ్యాజిక్ చూస్తూ కూర్చోవాలి అంతే. కేజిఎఫ్ మొదటి భాగంలోనే బాప్ కా ఎలివేషన్స్ అన్నీ చూపించాడు ప్రశాంత్ నీల్. రెండో భాగంలో కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఏం తీసాడ్రా ఈ సీన్ అనుకునే లోపు మరో సీన్ వస్తుంది. అలా క్లైమాక్స్ వరకు ఎన్నో సార్లు అనుకుంటాం. ఈ గ్యాప్ లో అసలు కథేంటి.. ఏముంది ఇందులో.. హీరో ఎందుకు అలా చేస్తున్నాడు.. అని ఆలోచించే టైం కూడా దర్శకుడు ఇవ్వలేదు. కేవలం ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతోనే విందు భోజనం వడ్డించాడు.
మొదటి భాగాన్ని చూసి అదే స్థాయిలో అంచనాలు పెట్టుకుంటే కాస్త నిరాశ పడతారు. అలా కాకుండా మరోసారి రాఖీ భాయ్ రచ్చ చూడాలనుకుంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు హైలైట్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. యశ్ తర్వాత సినిమాకు సంగీత దర్శకుడు రవి బస్రూర్ రూట్ మరో హీరో. యష్ మరోసారి రాకింగ్ పర్ఫార్మెన్స్ తో కరెంటు పుట్టించాడు. సంజయ్ దత్ పర్లేదు.. రవీనా టాండన్ అదరగొట్టింది. ఓవరాల్ గా కేజీఎఫ్ చాప్టర్-2 జస్ట్ గో ఎంజాయ్ ది మాస్ హిస్టీరియా ఆఫ్ రాఖీ భాయ్.