టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar). సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ కోసం భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వేసవికి అభిమానుల్లో జోష్ నింపేలా టీజర్, గ్లింప్స్ వీడియో, సలార్ పోస్టర్లు.. ఇలా ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. సినిమా థ్రియాట్రికల్ రిలీజ్‌కు అనుగుణంగా ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నాడని ఇన్ సైడ్ టాక్.
తాజా అప్డేట్ ప్రకారం విడుదలకు 3 నెలల ముందు నుంచే ప్రభాస్‌తో కలిసి సలార్‌ను ప్రమోట్ చేయనున్నాడట ప్రశాంత్ నీల్. మొత్తానికి ప్రభాస్‌కున్న క్రేజ్‌ను ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్గా వినియోగించుకుంటూ సలార్ మార్కెట్ పెంచుకోవాలన్న ఆలోచన బాగుందంటున్నారు ప్రభాస్ అభిమానులు, మూవీ లవర్స్. కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్ వద్ద విజయ పరంపర కొనసాగించిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ప్రభాస్ సలార్‌తోపాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ K చేస్తుండగా.. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌లో నటిస్తున్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాజా డీలక్స్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.