NTR 31 | కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel). ఆ తర్వాత కేజీఎఫ్ 2తో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో ట్రెండ్ క్రియేట్ చేసే సలార్ (Salaar)ను తెరకెక్కించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నీల్ ఒక సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం సలార్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గురించి చర్చ రాగా.. నీల్ మాట్లాడుతూ.. సినిమా స్టోరీ లైన్ గురించి ఓ హింట్ ఇచ్చాడు. ఈ సినిమా నా ముందు సినిమాలకంటే భిన్నంగా ఉంటుంది. నేను సినిమా జానర్ గురించి మాట్లాడను. కానీ, ఫ్యాన్స్ అందరూ ఇది యాక్షన్ ఫిల్మ్ అని అనుకుంటున్నారు. అయితే ఆడియన్స్‌కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది వరకు లాగా కాకుండా ఈ సినిమాను కొత్త జానర్ కథతో తెరకెక్కిస్తున్నా. ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా కథ ఉంటుంది అని నీల్ చెప్పుకోచ్చారు. దీంతో సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.