Salaar | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న సలార్ గురించి ఓ గాసిప్ నెట్టింట షికారు చేస్తోంది.
ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఇంతకీ ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం సలార్ థియేటర్లలోకి వస్తుందా..? లేదా..? అంటూ డైలామాలో పడిపోయారు ప్రభాస్ అభిమానులు. సలార్ రిలీజ్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా నెటిజన్లు, ఫ్యాన్స్ రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సలార్ టీం గాసిప్స్ కు చెక్ పెడుతూ స్పష్టత ఇచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2023 సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుందంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రిలాక్స్ అయిపోతున్నారు అభిమానులు.
సలార్ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సలార్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రెండు పార్టులుగా రాబోతుండటంతో ప్రభాస్.. ఈ రెండింటిలో ఎలా కనిపించబోతున్నాడోనంటూ తెగ ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ సలార్ కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్స్ కూడా రెడీ చేసుకున్నాడని ఇన్సైడ్ టాక్.
ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఆదిపురుష్ జూన్ 16 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.