Prashanth Neel | కేజీఎఫ్ సిరీస్ తో కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వంద కోట్ల బొమ్మ కూడా లేని కన్నడ సినిమాకు ఏకంగా వెయ్యి కోట్ల బొమ్మను పరిచయం చేశాడు. ఈ ఒక్క సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్ కు రాజమౌళి ఎలాగో.. కోలీవుడ్ కు ప్రశాంత్ నీల్ అలాగా అని ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా ఆదివారం ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెష్ వెల్లువెత్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. కాగా ఆయన పుట్టినరోజు వేడుకలను సలార్ సెట్లో ప్రభాస్ ఘనంగా సెలబ్రేట్ చేశారు.
ప్రభాస్.. ప్రశాంత్ నీల్ తో కేక్ కట్ చేయించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సలార్ బృందంతో పాటు ప్రశాంత్ భార్య కూడా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ప్రభాస్ అభిమానులే కాదు.. సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Prashanth Neel birthday celebrations#Salaar | #Prabhas pic.twitter.com/9iURFGreUb
— Manobala Vijayabalan (@ManobalaV) June 4, 2023