సదన్, ప్రియాంకప్రసాద్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రణయగోదారి’. డైలాగ్‌కింగ్ సాయికుమార్ ఇందులో పెదకాపుగా ప్రత్యేకపాత్రలో కనిపించనున్నారు. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడు. పారమళ్ల లింగయ్య నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణదశలో ఉంది. శుక్రవారం పెదకాపుగా సాయికుమార్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి ఆయన శుభాకాంక్షలు అందించారు. అన్ని వర్గాలకూ నచ్చే కథతో ఈ సినిమా రూపొందుతున్నదని, టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నామని కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ.