సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకుడు. పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు సంస్థ బ్యానర్ లోగోను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. గోదావరి నేపథ్యంలో అందంగా తీర్చిదిద్దిగా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని, ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, రచన-దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్.