Prakash Raj | కాశ్మీర్ పహాల్గాం ప్రాంతంలో జరిగిన ఊచ కోత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెర్రరిస్ట్లు జరిపిన దాడిలో 28కి మందికి పైగా మరణించారు. అడిగిమరీ అనే ప్రాంతంలో నుంచి వచ్చిన పర్యాటకులను దారుణంగా చంపేసిన ఘటన మొత్తం దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా సంచలనంగా మారింది. ఉగ్రమూకలు చేసిన మారణ కాండపై దేశమంతట పార్టీల కతీతంగా పలువురు రాజకీయ నేతలు కామెంట్స్ చేశారు. సినీ సెలబ్రిటీలు సైతం దీనిని ఖండించారు. అయితే ఇలాంటి విషయాలపై ముందుగా స్పందించే ప్రకాశ్ రాజ్ కాస్త ఆలస్యంగా స్పందించారు.
జస్ట్ ఆస్కీంగ్ అంటూ ఎవరో ఒకరిపై ఏదో ఒక సెటైర్ వేసే ప్రకాశ్ రాజ్ ఉగ్రవాదం విషయంలో ఇంకా స్పందించకపోయే సరికి కొందరు నెటిజన్స్ అతనిపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్.. పహల్గం దాడిపై ఆయన రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రదాడికి ఖండిస్తు, పిరికి పంద చర్యగా చెప్పుకొచ్చారు. అమాయకులపైన టూరిస్టులను హతమార్చడం ఘోరమన్నారు. ఈ ఘటనతో కశ్మీర్ ప్రజల గుండె పగిలిందన్నారు. వాళ్లంతా ముక్తకంఠంతో మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నాని స్పష్టం చేశారు.
కశ్మీర్ ఆటస్థలం కాదంటూ సీరియస్గా మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. ప్రశాంతమైన వాతావరణం, సెలయేళ్లు, నేచర్ ను ఒక్కసారిగా డిస్టర్ట్ చేసి.. రక్తపాతం పారేలా చేశారన్నారు. ఈ చర్య కశ్మీరీలు చేసింది కాదన్నారు. అంతేకాకుండా.. కశ్మీర్ ప్రజలంతా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. టూరిస్టులు వచ్చి ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణంను..ఈ విధంగా రణరంగంగా మార్చిన ఉగ్రచర్యను పిరికి పంద చర్యగా ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. మొత్తంగా కశ్మీర్ లో జరిగిన ఘటన మాత్రం చాలా ఘోరమని చెబుతూ.. అసువులు బాసిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించారు.అంతేకాదు బాధితుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. అంత స్పష్టంగా పేర్లు అడిగి మరీ చంపినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ మాటలను ఎక్కడా చెప్పకపోవడంతో తన ప్రెస్ నోట్ కి విలువ లేకుండా పోయిందని చెప్పవచ్చు